Neo Liberal Economy & Majoritarian Polity, India's path forward under the present regime
- NRR Research Center
- Aug 7, 2024
- 2 min read
Neelam Rajasekhar Reddy Memorial Lecture,
by Dr. Parakala Prabhakar, July 21, 2024.

ప్రజాస్వామ్యం, సెక్యూలరిజం, రాజ్యంగాన్ని, సమానత్వాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంటే, మరో వైపు వాటిని రక్షించే వారిని సంఖ్య రోజురోజుకూ తగ్గుతోందని ఆర్థిక, రాజకీయ వేత్త, విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే కాదని, తమది సెక్యులరి పార్టీ అని చెప్పుకునే పరిస్థితుల నుంచి తామూ హిందూవులమేనని, కానీ వారి తరహా కాదని చెప్పుకునే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. “అసమాన భారతం, ఆర్థిక, రాజకీయ పార్శాలు” అనే అంశంపైన హైదరాబాద్,కొండాపూర్ సి.ఆర్. ఫౌండేషన్, నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రంలో డాక్టర్ పరకాల ప్రభాకర్ “నీలం రాజశేఖర్ రెడ్డి ” స్మారక ఉపన్యాం చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత భారత రాయబరి ,ఎన్ డైరక్టర్ టి. సురేష్ అధ్యక్షత వహించగా సి.ఆర్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కె.నారాయణ, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు డాక్టర్.బి.వి.విజయలక్ష్మి,బిఎస్ మోహన్ సి.ఆర్.ఫౌండేషన్ కోశాధికారి చెన్నకేశవరావు, మెడికల్ సెంటర్ డైరక్టర్ కె.రజని హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలోని తాజా పరిణామాలు, ఆర్థిక, రాజకీయ అంశాలపై రాజకీయ కార్యకర్తల్లో చైతన్యం తీసుకువచ్చేలా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు నీలం రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయ త్నాలు ఇప్పుడు చాలా వరకు తగ్గాయని తెలిపారు. నీలం రాజశేఖర్ రెడ్డి తరహా ఎప్పటికప్పడు మేలుకొల్పే కార్యక్రమాలు మరింత జరిగి ఉంటే కొత్త భారతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఉండేవి కావన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రజాస్వామ్యపరిరక్షణ లాంటి దేశంలో నెలకొన్న తాజా పరిణామాలను పరిశీలిస్తే ప్రజలను మేలుకొల్పేందుకు వామపక్ష పార్టీలకు ఇంతకన్న అనువైన వాతావరణం ఏముంటుందని తెలిపారు. సమాజంలో ఈ మాత్రం చైతన్యం ఉన్నదంటే అందుకు ఆనాడు నీలం రాజశేఖర్ రెడ్డి దేశ పరిస్థితులు, పరిణామాలపై ఎప్పటికప్పుడు రాజకీయ కార్యకర్తల్లో చైతన్యం కల్పించడమే కారణమన్నారు.
స్వాతంత్య్రంలో లేనివారూ దేశ భక్తులుగా మార్కెటింగ్ స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేని సంస్థ, వ్యక్తులు ప్రస్తుతం దేశ భక్తులుగా మార్కెటింగ్ చేసుకుంటున్నారని పరకాల ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఇటీవల జరిగిన అనేక పరిణామాలను సమాజం పట్టించుకోవడం లేదని, మొన్న,నిన్న, ఇవాళ జరిగిన అనేక సంఘటనలు సంబంధం లేదనట్టుగానే సమాజం స్పపౄ కోల్పోయిందన్నారు. పెట్రోల్ వంద రూపాయాలకు చేరుకుంటుందనే పెద్ద చర్చ జరిగిందని, చివరకు వంద దాటినా పెద్దగా స్పందన లేదని, కాలినడకన వెళ్లిన వలస కార్మికులు చనిపోయారని, పవిత్రగంగానదిలో వందల మృతదేహాలు తేలాయని ఇటువంటి సంఘటలను సమాజం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికలకు, ఎన్నిలకు మధ్య ఏమీ చేయడం లేదని స్వీప్ వాకింగ్ చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలను అవగాహన చేసుకుని,వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చాలా తక్కువ జరుగుతున్నాయని, అందుకే సమాజం ఏమీ పట్టించుకోవడం లేదని వివరించారు.
పాలస్తీనాకు చెందిన ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఇతర దేశాలకు చెందిన వారిని ఇజ్రాయిల్ నియమించుకుంటుందని, ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారు ఉద్యోగాల ఇజ్రాయిల్ రిక్రూట్ బోర్డ్ వద్ద బారులు తీరారంటేనే దేశంలో నిరుద్యోగ పరిస్థితులు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రప్రభుత్వ, ప్రధానమంత్రికి సలహాదారులుగా ఉన్న వారే దేశంలో అసమానతలు ఉండాలని, నిరుద్యోగాన్ని సమర్ధిస్తున్నారన్నారు.
జిఎస్ ఎంత వసూలు చేస్తే.. అంత అల్తాదాయక వర్గాలపై ప్రభావం దేశానికి సంబంధించిన పలు లెక్కలు, నిరుద్యోగం లాంటి పలు అంశాలపైన ఆర్ ఇచ్చే నివేదికను ఎవ్వరూ అనుమానించలేదని, కానీ ప్రస్తుతం ఆర్ కూడా రాజీపడిందని, అందుకే ఆర్ నివేదికలను అనుమానించాల్సి వస్తుందని పరకాల ప్రభాకర్ అన్నారు. వారానికి ఒక గంట చొప్పున ప్రతి నెలా 30గంటలు పనిచేసిన వారు నిరుద్యోగులుగా గుర్తించబోమని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపిందని, నిరుద్యోగానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని ఇచ్చిందని ఎద్దేవాచేశారు. ప్రజలపైన పరోక్షంగా పన్నులను పెంచి, కార్పొరేట్ శక్తులపైన పన్నులను తగ్గించారని, జిఎస్ ఎంత ఎక్కువగా వసూలు చేస్తే, అల్పాదాయక వర్గాలపై అంత ప్రభావం పడుతుందని ఆయన వివరించారు.
Media coverage






Comentarios